You are currently viewing మా అమ్మాయిలకి కూడా ఎంత భాధ ఉంటాదో మీకు అర్ధం అవుద్ది

మా అమ్మాయిలకి కూడా ఎంత భాధ ఉంటాదో మీకు అర్ధం అవుద్ది

నా పేరు పూజ. మాది నిజమాబాద్ లోని ఆర్మూర్. ఈ వెబ్సైటు లో కొందరి స్టోరీస్ చదివాను. అందరూ అమ్మాయిలు లవ్ లో హ్యాండ్ ఇస్తారు ఇది ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే భాధ అన్నట్టు చెప్తున్నారు. నా లవ్ స్టోరీ కూడా మీరు చదవండి. మా అమ్మాయిలకి కూడా ఎంత భాధ ఉంటాదో మీకు అర్ధం అవుద్ది.

నన్ను ఒక్కడు లవ్ చేసాడు. నా వెంట 1 ఇయర్ పడ్డాడు. నేను స్టార్టింగ్ లో అస్సలు ఒప్పుకోలేదు. అస్సలు నాకు లవ్ మీద నమ్మకం ఏ లేదు. చాలా రియల్ గా జరిగిన స్టోరీస్ చూసాను. లవ్ పెయిన్ తప్ప అస్సలు ఎం లేదు అన్న నమ్మకం లోనే ఉండే నేను. అందుకే వాడికి చాలా టైమ్స్ వార్నింగ్ ఇచాను బట్ వాడు అది అంత లైట్ గా తీస్కొని నా కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు.

నేను కావాలని వేరే మా ఫ్రెండ్ ఫోన్ నుండి మెసేజ్ చేసి వాడిని రాంగ్ ట్రాక్ చేదాం అని ట్రై చేసిన వాడు అస్సలు టెంప్ట్ కాలే. అక్కడే వాడి రియల్ లవ్ అని అర్ధం అయింది. నాకు అస్సలు లవ్ మీద నమ్మకం లేకున్నా ఎందుకో నాకు తెలియకుండానే వాడిని లవ్ చేయడం స్టార్ట్ చేసిన. కానీ వాడికి నేను చెప్పలేదు. కొన్ని డేస్ నార్మల్ గా మాట్లాడ్డం స్టార్ట్ చేశా.

అప్పుడు అర్ధం అయింది వాడు ఏంటో అని. నాకు మైండ్ బ్లాక్ అయింది. వాడికి ఆల్రెడీ 3 అమ్మాయిలతో లవ్ ట్రాక్ నడుపుతుండు అని. అస్సలు వాడిని ఎం చేయాలో అర్ధం కాలేదు. బట్ నా మనసులో వాడి మీద లవ్ స్టార్ట్ అయింది. నాకు ఇంకా ఏడుపు తప్ప ఎం చేయాలో అర్ధం కావట్లేదు.

నాకు ఒకటే అర్ధం అయింది. మనం ఎప్పుడు అయితే రియల్ గా ఒకరిని లవ్ చేస్తామో…వాళ్ళు ఎన్ని తప్పులు చేసిన మనం ఎంత హర్ట్ అయినా ఆ లవ్ అనేది ఎప్పటికి పోదు అని. నేను పడ్డ భాధ నాకు మాత్రమే తెలుసు. అమ్మాయిలు ఒక్కసారి లవ్ చేస్తే లైఫ్ మొత్తం మర్చిపోరు. కానీ ఆ లవ్ ని బయటకి చూపించం. నేను వాడికి ఒక పనిష్మెంట్ ఇట్చిన. ఆ ముగ్గురి అమ్మాయిలకి వీడు మాట్లాడిన చాట్ అంత సెండ్ చేసిన. వాడి నెంబర్ బ్లాక్ చేసి ఆ రోజు నుండి ఇప్పటిదాకా వాడితో ఎలాంటి మాటలు లేవు.

ఆ అమ్మాయిలు ఎలా రియాక్ట్ అయ్యారో కూడా తెలియదు. నాకు అనిపించినది నేను చేసిన. కానీ నా మనసు మాత్రం వాడి వాళ్ళ చాలా భాధ అనుభవిస్తుంది ఇప్పటికి కూడా. కొన్ని మూమెంట్స్ లో వాడు చూపించిన లవ్ ఇప్పటికి నన్ను హంట్ చేస్తూనే ఉంది. నాది ఒక్క రిక్వెస్ట్ మీ అందరికి లవ్ చేయొద్దు… చేస్తే మాత్రం మీకు మిగేలేది భాధ అండ్ టైం వేస్ట్. ఇంకా మీ ఖర్మ.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Harish M
3 months ago

చాలా మంది గర్ల్స్ అబ్బాయిలని మోసం చేయడమే వాళ్ళ పని. నవ్వు తో మమ్మల్ని పడేసి నవ్వుల పాలు చేస్తరు లాస్ట్ కి 😅😂