You are currently viewing నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది

నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది

శివ, ******, తెలంగాణా

నా పేరు శివ. అమ్మాయి పేరు చెప్పను. కానీ నన్ను చాలా మోసం చేసింది. కానీ తాను అంటే ఇప్పటికి చాలా ఇష్టమే. ఎందుకో తెలియదు తాను మోసం చేసిన కూడా తన మీద ఇంకా నా ప్రేమ పొవట్లేదు. ఇంకా తాను అంటే అంతే ప్రాణంగా ప్రేమిస్తున్న.

తాను నేను చాలా లవ్ చేసుకున్నాం. మా ఇద్దరిది చాలా జెన్యూన్ లవ్ అని ఇద్దరం చాలా సార్లు అనుకున్నాం. లైఫ్ లో ఎప్పటికి మనం విడిపోవొద్దు అని చాలా సార్లు అనుకున్నాం. తన లవ్ చూసాక నాకు ఇంకా ఈ లైఫ్ కి ఇది చాలు అనిపించింది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం లా అయిపోయాం. తనని చూడకపోతే ప్రాణం పోతున్నట్టే ఉండేది. తాను మాట్లాడితే ఇంకా చాలు ఈ లైఫ్ కి ఇంకా ఎం వొద్దు అనిపించేది. గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు మా ఇద్దరి ప్రాణం ఒకరి మీద ఇంకొకరికి. తనని ఎప్పుడు నవ్విస్తూ తాను నవ్వితే ఇదే నా లైఫ్ ఇంకా అనిపంచేది.

తనని ప్రతి క్షణం ఇంకా ఇంకా లవ్ చేయాలని అనిపించేది. బట్ తనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం తనని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ ఎం కావలి అన్నా ఆర్డర్ చేస్తూ ఉండేవాణ్ణి. తాను బిజీ గా ఉన్నప్పుడు నేను చాలా మిస్ అయేవాణ్ణి. తాను నన్ను లవ్ చేసే ప్రతి క్షణం నాకు ఇంకా గుర్తుంది. ఆ లవ్ వరల్డ్ లో ఇంకెవరు చేయలేరు. అంత బ్యూటిఫుల్ గా ఉండేది తన లవ్.

సడన్ గా ఒక రోజు మెసేజ్ చేసింది. ఇంకా నన్ను మర్చిపో అని. ఆ మూమెంట్ లోనే నేను చనిపోయాను. ఆ పెయిన్ ఇప్పటికి అననుభవిస్తూ ఏడుస్తూ ఉంటున్న.

తాను అలా మెసేజ్ చేయడానికి కారణమ్ తాను ఇంకొకరిని లవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ నాకు చెప్పింది. ఇది జరిగి మూడు నెలలు అయింది. తాను ఇప్పుడు చాలా హ్యాపీ గా ఉంది. నేను మాత్రం నాకే అర్ధం కానీ పెయిన్ ని అనుభవిస్తున్న. నాకు ఈ పెయిన్ నుండి ఎలా బయటకి రావాలో తెలియట్లేదు. అస్సలు నా లైఫ్ కి ఏమైనా అర్ధం ఉందా లేదా కూడా తెలియట్లేదు.

నిజం గా ప్రేమ అనేది ఉందా? రియల్ గా లవ్ చేస్తే ఇలానే అవుతుందా? టైంపాస్ లవ్ బెటర్ ఆ?

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments